చిన్నారులకు 43శాతం తక్కువగా కరోనా ముప్పు - younger people half as likely as adults to catch covid-19 study says
close
Published : 16/02/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారులకు 43శాతం తక్కువగా కరోనా ముప్పు

వెల్లడిస్తున్న అధ్యయనాలు

జెరూసలేం: పెద్దవారితో పోలిస్తే, చిన్నారులకు కరోనా వ్యాపించే అవకాశాలు 43శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వీరి నుంచి వైరస్‌ వ్యాప్తి కూడా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు ఇటీవల పీఎల్వోఎస్‌ కంప్యుటేషనల్‌ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వయసు ఎక్కువున్న వారితో పోలిస్తే, 20ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ఇంతకుముందు పరిశోధనల్లో పెద్దలకు, చిన్నారులకు కరోనా లక్షణాల్లో ఉండే వ్యత్యాసాలను గుర్తించారు. ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా వాలంటీర్లకు సెరోసర్వే నిర్వహించినట్లు వారు తెలిపారు. సెరో సర్వే ఆధారంగా ఒక వ్యక్తిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని గుర్తిస్తారు. ఇందులో 20 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారికి కరోనా సోకే అవకాశాలు 43శాతం తక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. అంతే కాకుండా వారు పెద్దవారితో పోలిస్తే 63శాతం తక్కువగా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని వెల్లడించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో కూడా చిన్నారులు, యువతకు ఎక్కువగా కరోనా నెగెటివ్‌ వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని