AP news: నేడు వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల - ysr vahana mitra funds will be realeses tomorrow
close
Published : 15/06/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP news: నేడు వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల

అమరావతి: వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని  సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.48 లక్షల మంది డ్రైవర్లకు రూ.248 కోట్ల ఆర్థిక సాయం అందనుంది.

మరోవైపు జగనన్న విద్యాకానుక కిట్‌లో చిన్న సైజ్‌ ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. నిఘంటువు కొనుగోలు చేసేందుకు పాలనా అనుమతిని ఇచ్చింది. విద్యా కానుక కిట్‌లో ఇంగ్లిష్‌-ఇంగ్లిష్‌-తెలుగు నిఘంటువు చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 23.5 లక్షల మందికి నిఘంటువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని