అదిరే స్టెప్పులతో ‘యువరత్న’ సాంగ్‌! - yuvarathna vedio song by punith rajkumar
close
Published : 17/03/2021 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదిరే స్టెప్పులతో ‘యువరత్న’ సాంగ్‌!

హైదరాబాద్‌: కన్నడలో అగ్రనటుడిగా వెలుగొందుతున్న పునీత్‌ రాజ్‌కుమార్‌(ఫ్యాన్స్‌ ‘అప్పు’గా పిలుచుకుంటారు) తెలుగులో తొలిసారి స్ట్రెయిట్‌ చిత్రంతో వస్తున్నారు. ‘యువరత్న’పేరుతో వస్తున్న ఈ చిత్రంలోని తెలుగు వెర్షన్‌ పాటలు కొన్ని ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘యువరత్న’టైటిల్‌ సాంగ్‌ను అప్పు పుట్టినరోజు కానుకగా చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ తనదైన శైలిలో వేస్తున్న స్పీడ్‌ డ్యాన్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘కె.జి.ఎఫ్’ఫేమ్‌ హోమబలే సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ అన్నాద్రం దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫీల్‌ ద పవర్‌’ పవర్‌ అంటూ సాగుతున్న ఈ పాటను రేవంత్‌ ఆలపించగా, కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటిదాకా అప్పు అదిరే స్టెప్పులను ఓ లుక్కేసుకోండి!   
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని