‘పవర్‌’ఫుల్‌గా ‘యువరత్న’ ట్రైలర్‌! - yuvaratna trailer
close
Published : 20/03/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పవర్‌’ఫుల్‌గా ‘యువరత్న’ ట్రైలర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తొలిసారి డైరెక్ట్‌ మూవీతో తెలుగులోకి రాబోతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘యువరత్న’ ట్రైలర్‌ను విడుదల చేశారు. కళాశాలల్లో జరిగే వివిధ ఘటనలు, డ్రగ్స్‌ వంటి అంశాలపై సినిమాలో ప్రస్తావించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమౌతోంది. ముఖ్యంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘ఫస్ట్‌ బెంచ్‌లో కూర్చుంటే బోర్డు మాత్రమే కనిపిస్తుంది..అదే లాస్ట్‌ బెంచ్‌లో కూర్చుంటే గ్లోబ్‌ మొత్తం కనిపిస్తుంది’అంటూ చెప్తున్న డైలాగ్స్ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రకాష్‌రాజ్‌, సాయేషా  ఈ చిత్రంలో ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్‌’ ఫేమ్‌ హోమబలే సంస్థ సినిమాను నిర్మించగా సంతోష్‌ అన్నాద్రం తెరకెక్కించారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఏప్రిల్‌ 1వ తేదిన చిత్రం విడుదల కానుంది. మరి లేటెందుకు ఆ పవర్‌ఫుల్‌ ట్రైలర్‌ను మీరు చూసేయండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని