యూజీ సంగీత్‌లో ధావన్‌ చిందులు - yuzi chahal sangeet
close
Published : 01/01/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూజీ సంగీత్‌లో ధావన్‌ చిందులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ‘అల్లరి పిల్లాడు’ యుజ్వేంద్ర చాహల్‌ ఈ మధ్య ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్‌ 23న ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి దుబాయ్‌లో హనీమూన్‌ ట్రిప్‌ ఆస్వాదిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహవేడుక చిత్రాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ‘సంగీత్’కు సంబంధించిన చిత్రాలను పోస్ట్‌చేశాడు. ‘ఈ ఏడాది (2020) అత్యంత ఆసక్తి రేపిన, ఉత్సాహకరమైన ప్రదర్శనలివే’ అంటూ వ్యాఖ్య జత చేశాడు. అతడి సతీమణి ధనశ్రీ సైతం మరికొన్ని చిత్రాలను పోస్ట్‌ చేయడం గమనార్హం.

తన మణికట్టు మాయాజాలంతో పలుదేశాల క్రికెటర్లను పెవిలియన్‌కు‌ పంపించిన యూజీకి లాక్‌డౌన్‌లో పెళ్లి కుదిరింది. అప్పుడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌కు వచ్చిన యూజీని చూసేందుకు ధనశ్రీ సైతం రావడం గమనార్హం. లీగ్‌ ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో ఉండటంతో సహచరులెవరూ పెళ్లికి హాజరుకాలేదు. శిఖర్ ధావన్‌ మాత్రం సంగీత్‌ వేడుకకు వచ్చి చిందులు వేశాడు. రెండు రోజుల క్రితమే నూతన దంపతులు ఎంఎస్‌ ధోనీ, సాక్షిసింగ్‌ ఆతిథ్యాన్ని స్వీకరించడం గమనార్హం.

ఇవీ చదవండి
అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!
వార్నర్‌ దశావతారం..హార్దిక్‌ హ్యాపీ హ్యాపీ!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని