యూజీ-ధనశ్రీ పెళ్లి వీడియో చూస్తారా? - yuzi dhanashri wedding film
close
Published : 03/04/2021 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూజీ-ధనశ్రీ పెళ్లి వీడియో చూస్తారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ గతేడాది డిసెంబర్‌ 22న ధనశ్రీ వర్మకు తాళి కట్టాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సంగీత్‌ నుంచి పెళ్లి వరకు ఒకటే హంగామా. వేడుకగా జరిగిన వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలు అప్పట్లో ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. యూజీ, ధనశ్రీ చిందులు వేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా వీరి వివాహ మహోత్సవానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఆ తర్వాత యూఏఈలో సందడి చేసింది. యూజీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు శిబిరానికి ధనశ్రీ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కోహ్లీ, అనుష్క జంటతో సరదాగా గడిపారు. వివాహం జరిగిన వెంటనే ధోనీ-సాక్షితో కలిసి విందుకు వెళ్లారు. వీరి సంగీత్‌లో శిఖర్‌ ధావన్‌ వేసిన స్టెప్పులు అలరించాయి. ప్రస్తుతం యూజీ.. ఐపీఎల్‌ 2021కు సన్నద్ధం అవుతున్నాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని