పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌ - yuzuvendra chahal and rashid khan trolls rishabh pant after posting a cartoon related picture on instagram
close
Published : 25/01/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను యుజువేంద్ర చాహల్‌, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ట్రోల్ చేశారు. తాజాగా పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకోన్నాడు. ఆ ఫొటోలో ఎర్ర రంగు టీషర్ట్‌ ధరించాడు. దాని మీద ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ కార్టూన్‌ బొమ్మ ఉండడంతో పంత్‌ పోస్టు చేస్తూ ఇలా అన్నాడు. ‘మీలో ఎంతమంది ఈ కార్టూన్‌ను చూశారు?’ అని ప్రశ్నించాడు. 

ఆ పోస్టు చూసిన చాహల్‌ స్పందిస్తూ ‘నిన్ను చూడటమా (పంత్‌ను కార్టూన్‌ బాయ్‌గా సంభోదించడం) లేక టామ్ అండ్‌ జెర్రీని‌ చూడటమా?’ అని సరదాగా గేలి చేశాడు. ఆపై రషీద్‌ఖాన్ కూడా అంతే సరదాగా కామెంట్‌ చేశాడు. ‘నేను చాలాసార్లు నిన్నూ చూశాను, ఆ టామ్‌ను చూశాను’ అని పేర్కొన్నాడు. కాగా, వీరిద్దరి కామెంట్లకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాహల్‌ కామెంట్‌ను సుమారు 15 వేల మంది లైక్‌ చేయగా, రషీద్‌ కామెంట్‌ను 4 వేల మందికిపైగా ఇష్టపడ్డారు. 

పంత్‌ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టులో 89* పరుగులతో మెరుపు బ్యాటింగ్‌ చేసి జట్టుకు చారిత్రక విజయం అందించాడు. దాంతో ఒక్కసారిగా పంత్‌ హీరో అయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకున్న అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్నట్లు పంత్‌ తాజాగా చెప్పాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో హాయిగా గడపడంతో ఒత్తిడిని అధిగమించానని అన్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో బాగా ఆడినట్లు వివరించాడు.

ఇవీ చదవండి..
అంతకంటే గొప్పేముంటుంది?
ఘనతంతా కుర్రాళ్లదేAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని