యూజీ ‘హార్ట్‌’ ధనశ్రీతో ‘లాక్‌’: త్వరలో పెళ్లి - yuzvendra chahal dhana shri rokha ceremony
close
Published : 08/08/2020 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూజీ ‘హార్ట్‌’ ధనశ్రీతో ‘లాక్‌’: త్వరలో పెళ్లి

(చిత్రం: చాహల్‌ ట్విటర్‌ నుంచి)

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా అల్లరి కుర్రాడు యుజువేంద్ర చాహల్‌ అందరికీ ఒక్కసారిగా షాకిచ్చాడు! లాక్‌డౌన్‌లో తన మనసుకు నచ్చిన అమ్మాయితో లాకైపోయానని ప్రకటించేశాడు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ.. కవ్విస్తూ.. సరదాగా కబుర్లు చెప్పే యూజీ హఠాత్తుగా పెళ్లికబురు చెప్పడంతో అభిమానులు, క్రికెటర్లు ఆశ్చర్యపోక తప్పలేదు.

యూజీ మనసు దోచేసిన ఆ అందమైన అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ అని తెలిసింది. ఆమె కుటుంబ, వ్యక్తిగత వివరాలు తెలియాల్సి ఉంది. ‘మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ ‘అవును’ అనేశాం. #రోకా వేడుక’ అని చాహల్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. వేడుకకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు.

కొత్త జంటకు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, అభిషేక్‌ కపూర్‌, ఆకాశ్‌ చోప్రా, కునాల్‌ కపూర్‌, కేఎల్‌ రాహుల్‌, హిమాన్షి ఖురానా, గౌరవ్‌ కపూర్‌, బౌలింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌, ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనీ వ్యాట్‌, రోహిత్‌ సతీమణి రితికా సజ్దె, వాషింగ్టన్ ‌సుందర్‌, హార్దిక్‌ పాండ్య, మన్‌దీప్‌ సింగ్‌ తదితరులు అభినందనలు తెలియజేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని