Chahal: ధనశ్రీ డ్యాన్స్‌.. చాటుగా చూస్తున్న చాహల్‌ - yuzvendra chahal peeks from behind the curtain in dhanashree vermas latest dance video
close
Published : 26/05/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chahal: ధనశ్రీ డ్యాన్స్‌.. చాటుగా చూస్తున్న చాహల్‌

(photo:Yuzvendra Chahal Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. అతని భార్య ధనశ్రీ వర్మకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన ఆమె మంచి డ్యాన్సర్‌ కూడా. యూ ట్యూబర్‌గానూ ఫేమస్‌. ఆమె తరుచూ తాను డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంటుంది. ఇటీవల ఆర్సీబీ జెర్సీ వేసుకుని డ్యాన్స్‌ చేసి అలరించిన ధనశ్రీ... తాజాగా మరో రెండు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

ఈ రెండు వీడియోల్లో ఒకే రకమైన డ్రెస్‌లో, ఒకే ప్రదేశంలో, ఒకే రకమైన డ్యాన్స్‌తో అలరించింది ధనశ్రీ. కానీ మొదట పోస్టు చేసిన వీడియోకి రెండోసారి పోస్టు చేసిన వీడియోని పరిశీలిస్తే ఓ తేడా కనిపిస్తోంది. అదేంటంటే రెండో వీడియోలో చాహల్ పరదా చాటున ఉండి తన రెండు పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ధనశ్రీ చేస్తున్న డ్యాన్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేశాడు. అయితే, మొదటి వీడియో పోస్టు చేసినప్పుడే ఇందుకు సంబంధించిన హింట్ ఇచ్చింది ధనశ్రీ. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను మీరు కూడా చూసేయండి!





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని