Covid:చాహల్ తల్లిదండ్రులకు కరోనా  - yuzvendra chahal’s parents have tested positive for covid 19
close
Published : 13/05/2021 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid:చాహల్ తల్లిదండ్రులకు కరోనా 

(photo:Yuzvendra Chahal Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. కాగా, చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.  

‘ఏప్రిల్‌-మే నెలల్లో నేను మానసికంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నా. ఆ సమయంలో నా తల్లి, సోదరుడు కరోనా బారినపడ్డారు. ఐపీఎల్ బయోబబుల్‌లో ఉండటంతో నిస్సహాయురాలిగా మిగిలాను. కానీ, నిత్యం వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేదాన్ని. నిజంగా కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టం. అదృష్టవశాత్తు వారు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు నా అత్తయ్య, మామయ్య (చాహల్‌ తల్లిదండ్రులు) తీవ్రమైన లక్షణాలతో కరోనా బారినపడ్డారు. మామయ్య ఆస్పత్రిలో చేరగా.. అత్తయ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. నేను ఆస్పత్రిలో ఉన్నాను. బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. నేను అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని