ఆర్సీబీ జెర్సీలో చాహల్ భార్య స్టెప్పులు - yuzvendra chahals wife dhanashree verma shows off dance moves in rcb jersey
close
Published : 19/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్సీబీ జెర్సీలో చాహల్ భార్య స్టెప్పులు

            

                           (photo: Yuzvendra Chahal Twitter)                        

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా స్పిన్నర్‌, ఆర్సీబీ ఆటగాడు యుజువేంద్ర చాహల్  సామాజిక మాధ్యమాల్లో ఎంత హుషారుగా ఉంటాడో.. అతని సతీమణి ధనశ్రీ వర్మ సైతం అంతే ఉత్సాహంతో సోషల్‌ మీడియాలో తన వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంటుంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా రెండో వేవ్‌తో రద్దవ్వడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్రనిరాశకు గురయ్యారు. దీంతో ఆటగాళ్లు కూడా సామాజిక మధ్యమాల్లో తరుచూ వీడియోలు చేస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు.  కొరియోగ్రఫర్‌, యూట్యూబర్‌గా ఫేమస్‌ అయిన ధనశ్రీ తాజాగా ఆర్సీబీ జెర్సీ ధరించి ప్రఖ్యాత అమెరికన్ ర్యాపర్‌ సౌలిజా బాయ్స్‌ రూపొందించిన ‘షి మేక్‌ ఇట్‌ క్లాప్‌’ అనే పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోకి రెండు గంటల్లోనే రెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి మరి! 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని