యూవీ, ఓజా మధ్య కేక్ ఫైట్‌!  - yv ojha engage in cake fight rohan gavaskar tweets video
close
Published : 17/03/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూవీ, ఓజా మధ్య కేక్ ఫైట్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో చాలా కాలం తర్వాత భారత మాజీ క్రికెటర్లు కలుసుకోవడానికి రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ 20 సిరీస్‌ వేదికైంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్‌ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ఈ నెల 5 నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచే సిరీస్‌ పున:ప్రారంభం అయింది. ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉన్న ఇండియా లెజెండ్స్‌ జట్టు.. ఉల్లాసంగా గడుపుతోంది. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ల మధ్య కేక్‌ ఫైట్‌ జరిగింది. సరదాగా సాగిన ఈ కేక్‌ ఫైట్‌కు సంబంధించిన వీడియోను భారత మాజీ క్రికెటర్‌ రోహన్ గావస్కర్ మంగళవారం ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. భారత మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్ ఓజాను జట్టు సభ్యులు పట్టుకోగా..యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్‌ పఠాన్‌లు ఓజా ముఖంపై కేక్‌ పూశారు. వెంటనే  కేక్‌ పూయడానికి ఓజా ప్రయత్నించగా ఇర్ఫాన్‌ పఠాన్‌ పరుగెత్తుకుని తప్పించుకున్నాడు. ఇంతలో ప్రజ్ఞాన్ ఓజా యువరాజ్‌ సింగ్‌కు కేక్‌ పూయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మహ్మద్ కైఫ్‌ యూవీని పట్టుకోగా ఓజా అతని ముఖంపై కేక్‌ పూసి ప్రతీకారం తీర్చుకున్నాడు.

మరోవైపు రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ 20 సిరీస్‌లో శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను 56 పరుగుల తేడాతో ఓడించి ఇండియా లెజెండ్స్‌ సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కేవలం 37 బంతుల్లో 60 పరుగులు చేశాడు. యువరాజ్‌ సింగ్‌  యూవీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిశాడు. ఒకే ఓవర్‌లో  వరుసగా నాలుగు సిక్సర్లు బాది కేవలం 21 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో భాగంగా భారత్‌ బుధవారం తొలి సెమీఫైనల్‌ ఆడనుంది. రాయ్‌పూర్‌లోని షాహెద్‌ వీర్‌ నారాయణ్ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం ఫైనల్‌ జరగనుంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని