ఒళ్లు గగుర్పొడిచేలా ‘జాంబిరెడ్డి’ మేకింగ్‌ వీడియో - zombiereddy​ making video a prasanth varma film
close
Updated : 04/02/2021 21:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒళ్లు గగుర్పొడిచేలా ‘జాంబిరెడ్డి’ మేకింగ్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అ!’, ‘కల్కీ’ వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన చిత్రాన్ని మనముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటి వరకూ హాలీవుడ్‌కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై చూపించబోతున్నాడు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్లు. జబర్దస్త్‌ గెటప్‌ శ్రీను, పృథ్వీరాజ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో నటులందర్నీ జాంబీలుగా చూపించడంతో పాటు తెరపై ఒక భీతిల్లే వాతావరణాన్ని చూపించేందుకు ఎంతో కష్టపడ్డామని డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ చెప్పిన విషయం తెలిసిందే. కాగా. ఈ సందర్భంగా చిత్రబృందం మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోను మీరూ వీక్షించండి మరి.

ఇదీ చదవండి...

సమీరా సీమంతం.. నదిలో రెజీనా శిక్షణAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని