మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి - zombiereddy​ pre release a prasanth varma film teja sajja
close
Updated : 03/02/2021 04:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి

హైదరాబాద్‌: తేజ సజ్జ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాంబీరెడ్డి’. ‘అ!’, ‘కల్కీ’ సినిమాల డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో వరుణ్‌తేజ హాజరయ్యారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ, నిర్మాత రాజశేఖర్‌వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించామన్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ చిత్రమిదే. ఈ చిత్రానికి యూనిట్‌ సభ్యులంతా చాలా కష్టపడ్డట్లు వారు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగులో తాము కొత్త ప్రయోగంతో మంచి సినిమా తీశామని, అందరూ స్వాగతించి.. సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి..

క్లాస్‌ కల్యాణి.. మాస్‌ బిర్యాని.. సాంగ్‌ చూశారా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని