radhe: జూమ్‌ జూమ్‌ సాంగ్‌ అదుర్స్‌ - zoom zoom song salman khandisha patani radhe your most wanted bhai movie
close
Published : 10/05/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

radhe: జూమ్‌ జూమ్‌ సాంగ్‌ అదుర్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్: సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయి’. దిశా పటానీ కథానాయిక. జాకీ ష్రాఫ్‌, రణదీప్‌ హుడా, మేఘా ఆకాశ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఈద్‌ పండగ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘జూమ్‌ జూమ్‌’ అంటూ సాగే పాటని ఈరోజు చిత్రబృందం విడుదల చేసింది. కునాల్‌ వర్మ కలంలో నుంచి జాలువారిన ఈ గీతాన్ని ఆష్ కింగ్, లూలియా వంతూర్ ఆలపించగా సాజిద్ వాజిద్ సంగీత స్వరాలు సమకుర్చారు. సీజర్ గోన్సాల్వ్స్ కొరియోగ్రఫీ అందించారు. జీ స్టూడియోస్, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ , రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సోహైల్‌ ఖాన్‌, అతుల్‌ అగ్నిహోత్రి నిర్మాతలు. ‘రాధే’ సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘వెటరన్‌’కు రీమేక్‌. సాజిద్‌ వాజిద్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హిమేశ్‌ రేష్మియాలు సంగీతం అందించారు. కరోనా వైరస్ లేకుంటే గతేడాది మే 22న నాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ‘సీటీమార్’, ‘దిల్ దే దియా’ వంటి పాటలు ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.  





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని