
స్నేహం ప్రేమ కలిస్తే ‘దేవ్’
కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకుడు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మాత. తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. కార్తి మాట్లాడుతూ ‘‘ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ‘దేవ్’తో కుదిరింది. ప్రతి ఒక్కరూ దేవ్లో తమని తాము చూసుకుంటారు. ఓ అందమైన ప్రేమకథ ఇది. స్నేహం, ప్రేమ రెండూ కలిస్తే ‘దేవ్’. వేర్వేరు ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. మేఘన పాత్రలో రకుల్ బాగా నటించింది. హారిశ్ జయరాజ్ అందించిన పాటలు బాగున్నాయి. ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట మరింత ఆకట్టుకుంటుంద’’న్నారు. ‘‘స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రలో నటించాను. శక్తిమంతమైన పాత్ర అది. ‘ఖాకి’ తరవాత కార్తితో మరోసారి నటించాను. ఆ సినిమాలానే ‘దేవ్’ విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంద’’ని చెప్పింది రకుల్. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాహసోపేతమైన పాత్రలో కార్తి కనిపిస్తారు. ఈ సినిమాలో అన్ని అంశాలూ చక్కగా కుదిరాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడ్డారు. అందరం కలసి ఓ మంచి సినిమా తీయగలిగా’’మన్నారు. మధు మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఏం చెప్పాడో అదే తీశాడు. కార్తి, రకుల్‌ల జంట మరోసారి ఆకట్టుకుంటుంది. సంగీతం బాగా కుదిరింద’’న్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- పది కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని..
- తండ్రి కారు కింద చితికిపోయిన చిన్నారి
- ‘రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు..చంపేయండి’
- కన్నబిడ్డ వివాహమైన కాసేపటికే
- ఉగ్రదాడిని ఖండిస్తూనే.. చైనా వక్రబుద్ధి
- 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు
- ప్రేమ వ్యవహారమే కారణమా?
- మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
- ఆస్ట్రేలియా సిరీస్‌కు కేఎల్ రాహుల్
- పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరించారా?