
వేసవి బరి ఎవరిది గురి?
తెలుగు చిత్రసీమలో సంక్రాంతి పద్దులు ఓ కొలిక్కివచ్చాయి. పరాజయాన్ని చవిచూసిన సినిమాలు మిగిల్చిన నష్టమెంతో, విజయాన్ని అందుకొన్న సినిమాకి ఏ స్థాయి లాభాలు దక్కాయో దాదాపుగా తేలిపోయింది. ఇంతలోనే మరో కీలకమైన సీజన్‌కి రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత సినిమాలకి మరో బలమైన సీజన్ వేసవే. ఆ సమయంలో అగ్ర కథానాయకుల చిత్రాలు పోటాపోటీగా బాక్సాఫీసు బరిలోకి దిగుతుంటాయి. వసూళ్లతోనూ, కొత్త రికార్డులతోనూ వేడి పుట్టిస్తుంటాయి. ప్రేక్షకులకు మండుటెండల్లోనూ హాయైన వినోదాలు పంచుతుంటాయి. అందుకే సినీ ప్రేమికులంతా వేసవి కోసం ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి సినీ వేసవి ఎలా ఉంటుంది?ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు? పరిశీలిద్దాం పదండి..
తెలుగు చిత్రసీమలో వేసవి సీజన్ మార్చి నుంచి షురూ అవుతుంది. ఒక పక్క విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటే మరోపక్క కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. సినిమా బాగుందంటే ఏదో ఒక పూట థియేటర్‌కి వస్తారని... పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనంగా సినిమాల్ని ఆశ్రయిస్తారని దర్శకనిర్మాతలు నమ్ముతుంటారు. అందుకే పరీక్షల సమయంలోనూ ధైర్యంగా సినిమాల్ని విడుదల చేస్తుంటారు. ఈసారి మార్చి ఆరంభం నుంచే సినిమాల సందడి మొదలు కాబోతోంది. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘118’ మార్చి 1న విడుదల కాబోతోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయవుతున్న చిత్రమిది. నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలు. అదే రోజునే అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ‘ఏబీసీడీ’ విడుదల కాబోతోంది. మలయాళంలో విజయవంతమైన ‘ఏబీసీడీ’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. నిఖిల్ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్ సురవరం’ మార్చి 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే రోజునే నిహారిక ‘సూర్యకాంతం’ విడుదలవుతోంది. వేసవి సీజన్లో అగ్ర కథానాయకుల చిత్రాలే కాదు, పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలూ విడుదలవుతుంటాయి. సెలవులు కాబట్టి యువతరం అన్ని సినిమాల్నీ చూడటానికి ఆసక్తి చూపుతుందనే అభిప్రాయాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తుంటాయి. |
అసలు హంగామా ఏప్రిల్‌లో |
చిన్నచిత్రాలకూ అవకాశం |
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- ప్రాణం తీసిన పానీ పూరి
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- అసలు కాజల్‌కు ఏమైంది.. ఆ ఫొటోలేంటి?
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు