close
టాలీవుడ్‌
క్యూలో మరో దర్శకుడు?

విజయ్‌ దేవరకొండ... టాలీవుడ్‌లో హాట్‌ కేకులాంటి హీరో! ఇప్పుడు ఈ కథా  నాయకుడి కాల్షీట్లు దొరకడమే గగనం అయిపోయింది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయినా సరే, తన కోసం కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి. తాజాగా హను రాఘవపూడి కూడా విజయ్‌ కోసం ఓ కథ రాస్తున్నట్టు సమాచారం. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో ఆకట్టుకున్నాడు హను. ప్రస్తుతం ఓ ప్రేమ  కథని సిద్ధం  చేస్తున్నాడు. అది విజయ్‌ కోసమే అని సమాచారం. వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’తో బిజీగా ఉన్నాడు విజయ్‌. ‘హీరో’ఇటీవలే పట్టాలెక్కింది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.