
‘‘అద్భుతమైన విజయాల్ని అందుకునే ప్రేమకథలు దశాబ్దానికి ఒకట్రెండు మాత్రమే వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఉండేటంత కథాబలం మా ‘దొరసాని’లో ఉంద’’న్నారు కేవీఆర్ మహేంద్ర. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మహేంద్ర.
* ‘‘నాది 17 ఏళ్ల సినిమా ప్రయాణం. ‘నిశీధి’ లఘు చిత్రంతో గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తీసిన ‘నిశీధి’ 18 దేశాల్లో నిర్వహించిన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకుడు అభినందనలు తెలుపుతూ నాకు మెయిల్ చేశారు’’.
* ‘‘తెలంగాణలోని ఓ చిన్న పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ‘దొరసాని’. చిన్నతనంలో నేను చూసిన సంఘటనలే ఈ కథకు స్ఫూర్తి. అప్పటి తెలంగాణలోని పరిస్థితులు, గడీలు, దొరల వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి ప్రముఖ రచయితలు అల్లం రాజయ్య, దాశరథి రంగాచార్యులు లాంటి వారు రాసిన పుస్తకాలను అధ్యయనం చేశా. కథ రాసుకోవడానికి మూడేళ్లు పట్టింది. దీని కోసం దాదాపు 42 వెర్షన్లు రాసుకున్నా’’.
* ‘‘దొరసాని’ పాత్రలో శివాత్మికను తప్ప మరొకరిని ఊహించుకోలేను. ఇక రాజు పాత్రకు అవసరమైన అమాయకత్వం, నిజాయతీ ఆనంద్‌లో సహజంగానే ఉన్నాయి. పెద్దింటి అమ్మాయి - పేదింటి కుర్రాడు అన్న అంశంలో తప్ప.. ఈ చిత్రానికి గతంలో వచ్చిన సినిమాలకు సంబంధం ఉండదు. గత నాలుగేళ్లుగా నేను 1987 కాలంలోనే జీవిస్తున్నా. ఈ సినిమా హడావుడి ముగిశాకే తర్వాతి సినిమాపై దృష్టిపెడతా’’.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు