close
టాలీవుడ్‌
అంజిబాబు రాజకీయ ప్రయాణం

చిత్రం: మార్కెట్లో ప్రజాస్వామ్యం 
సంస్థ: స్నేహ చిత్ర పిక్చర్స్‌ 
నటీనటులు: ఆర్‌.నారాయణమూర్తి, కాశీ విశ్వనాథ్‌, ఎల్బీ శ్రీరామ్‌, గౌతమ్‌రాజు, కృష్ణనాయక్‌, మాధవి, భవానీ, రాజేశ్వరి తదితరులు 
సంగీతం, నిర్మాత, 
దర్శకత్వం: ఆర్‌.నారాయణమూర్తి 
కథ: అంజిబాబు (ఆర్‌.నారాయణమూర్తి) నిబద్ధత ఉన్న కార్యకర్త. తన పార్టీ గెలుపు కోసం, నాయకురాలి కోసం అహర్నిశలూ కష్టపడతాడు. కానీ పార్టీ గెలిచాక అధిష్ఠానం కార్యకర్తల్ని, ఇచ్చిన వాగ్దానాలనూ పక్కన పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీపై, అధిష్ఠానంపై ఎదురు తిరుగుతాడు అంజిబాబు. తనే ఓ నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులేంటి? వాటిపై ఎలా పోరాడాడు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? అనేదే కథ. 
ప్రత్యేకతలు: దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. వాళ్ల అండతో గద్దెనెక్కిన నేతలు ఏరు దాటాక తెప్పను తగలేసినట్టు వదిలేస్తారు. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పక్కన పెడతారు. స్వలాభం కోసం ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చేస్తున్నారు.ఈ పద్ధతి మార్చడానికి పోరాడిన ఓ కార్యకర్త కథ ఇది. నేటి రాజకీయాలకు అద్దం పట్టే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తినీ, పార్టీనీ లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా చేయలేదు. మొత్తం వ్యవస్థనే ప్రశ్నించే చిత్రమిది. ప్రజాకవులు గద్దర్‌, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, రాజలింగం రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. వాటికి మంచి స్పందన వచ్చింద’’న్నారు. 
విడుదల: శుక్రవారం


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.