close
టాలీవుడ్‌
యువతకు ప్రేరణ.. ‘సైమా’

‘‘సైమా’ పురస్కారాలెప్పుడూ నాకు ప్రత్యేకమే. ఆ వేడుకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘సైమా’కు శ్రీకారం చుట్టి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచాయంటే నమ్మబుద్ధి కావడం లేద’’న్నారు ప్రముఖ కథానాయిక శ్రియ. సౌత్‌ ఇండియన్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) సన్నాహక కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన లఘు చిత్రాలకు ‘సైమా’ అవార్డులు అందజేశారు. శ్రియ మాట్లాడుతూ ‘‘లఘు చిత్రాల్ని ప్రోత్సహించి, అవార్డులు ఇవ్వడం వల్ల యువతరంలో ఉండే ప్రతిభ బయటకు వస్తుంది. వాళ్లకు ‘సైమా’ ఓ ప్రేరణగా నిలుస్తుంద’’న్నారు. ‘‘సైమా’ ఓ బ్రాండ్‌గా మారిపోయింద’’న్నారు నిధి అగర్వాల్‌.  ‘‘వచ్చే నెల 15, 16ల్లో ఖతార్‌లో ‘సైమా’ వేడుక నిర్వహిస్తాం. దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ సినీ తారలు పాల్గొంటార’’ని ‘సైమా’  ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఇందూరి, రియాన్‌, తిరుమలరెడ్డి, ప్రియదర్శి, శాన్వి, ఆషిమా, రోహిణి శర్మ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.