Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009677
            [news_title_telugu_html] => 

సంగీత దర్శకుడు కోటి కొత్త అవతారం చూశారా?

[news_title_telugu] => సంగీత దర్శకుడు కోటి కొత్త అవతారం చూశారా? [news_title_english] => [news_short_description] => తన స్వరాలతో శ్రోతలను మైమరపించిన సంగీత దర్శకుడు కోటి. తెర వెనుక ఎన్నో అద్భుతమైన పాటలకు ఆయన స్వరకల్పన చేశారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం పోలీస్‌ ఆఫీసర్‌గా.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
సంగీత దర్శకుడు కోటి కొత్త అవతారం చూశారా? - EENADU
close
టాలీవుడ్‌
సంగీత దర్శకుడు కోటి కొత్త అవతారం చూశారా?

హైదరాబాద్: తన స్వరాలతో శ్రోతలను మైమరపించిన సంగీత దర్శకుడు కోటి. తెర వెనుక ఎన్నో అద్భుతమైన పాటలకు ఆయన స్వరకల్పన చేశారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం పోలీస్‌ ఆఫీసర్‌గా మారారు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దేవినేని’. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం సంగీత దర్శకుడు కోటికి సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నటీనటులు అందరూ బాగా నటించారు. నటించారు.. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, దేవినేని నెహ్రూగా నందమూరి తారక రత్న ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరించనున్నారు. 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ కేఎస్‌ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు.ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట హై వే లో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

 సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఇది రెండో దశ. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నా చిన్నప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఐపీఎస్‌  ఆఫీసర్‌గా చూడాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి  వెంటనే ఒప్పుకొన్నాను. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.