close
టాలీవుడ్‌
రాములా ఆగం చేసిందిరో

‘సామజవరగమన..’ పాటతో హోరెత్తించారు అల్లు అర్జున్‌.   ‘అల.. వైకుంఠపురములో’ కోసం విడుదల చేసిన తొలి గీతం అది. సోషల్‌ మీడియాలో ఆ పాట కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట బయటకు వస్తోంది.  అదే ‘రాములో.. రాములా’. కాసర్ల శ్యామ్‌ రచించారు. తమన్‌ సంగీతం అందించారు. ‘‘రాములో రాములా.. నన్నాగం చేసిందిరో, రాములా రాములా నా పాణం తీసిందిరో’’ అంటూ జానపద శైలిలో సాగే ఈ మాస్‌ గీతానికి సంబంధించిన టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. ఇదో పార్టీ గీతం. పూర్తి పాటని ఈనెల 26న వినిపిస్తారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌,  హారిక హాసిని సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.