close
టాలీవుడ్‌
మాస్‌ టైటిల్‌తో రవితేజ

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ నటిస్తున్న కొత్త సినిమాకు ‘క్రాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్‌ పోస్టర్‌తోపాటు, రవితేజ లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో రవితేజ యాంగ్రీ పోలీస్‌ లుక్‌లో కనిపించారు. వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజకు జంటగా శ్రుతి హాసన్‌ కనిపించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నారు. తమన్‌ స్వరాలను అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్‌రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కనిపించనున్నారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.