close
టాలీవుడ్‌
దూరాలు చూసే నయనాలలోన తీరాలు దరి చేరేనా!

నాయకానాయికల మనసులను ఆవిష్కరించే పాటలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ ‘మిస్‌ మ్యాచ్‌’లోని ‘కన్నాలే కలలెన్నో..’ పాటను హీరోహీరోయిన్‌ల అంతరంగాలతో పాటు... దర్శకుడి కోణాన్ని కూడా ప్రతిబింబిస్తూ రాశానని చెబుతున్నారు ధర్మతేజ. ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాట ప్రయాణం గురించి రచయిత ధర్మతేజ చెప్పిన విషయాలివీ...

‘‘నేనొక సంగీతకారుడిని. మణిశర్మ దగ్గర ప్రధాన సహాయకుడిగా 150 సినిమాలకి పనిచేశా. వేటూరి దగ్గర 12 ఏళ్లు పనిచేశా. చాలా మంది నన్ను వేటూరి గారి అబ్బాయి అనుకుంటారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి వచ్చిన ‘పాడుతా తీయగా’తో మొదలుపెట్టి ‘ఆజాద్‌’, ‘కౌరవుడు’... ఇలా పలు  చిత్రాలకి పాటలు రాశా. భిన్న ధృవాలున్న ఇద్దరు వ్యక్తులు కలుస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతున్న దశలో వచ్చే పాట ‘కన్నాలే కలలెన్నో..’. హీరో హీరోయిన్‌ల అంతరంగాన్ని, దర్శకుడి కోణాన్ని ఈ పాటలో చెప్పాలి. ముందే ఈ పాటని మాంటేజ్‌గా చిత్రీకరించారు. వేటూరి దగ్గర ఉన్నప్పుడు చాలామంది దర్శకులు తీసిన సన్నివేశాలకి పాట రాయాలని వచ్చేవారు. అప్పుడు ఆయన ఎలా  రాసేవారో గుర్తు చేసుకుని ఈ పాట రాశా. మెలోడీ కాబట్టి ప్రతి పదం స్పష్టంగా వినిపించేలా, పరభాష పదాలు లేకుండా సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. రెండు రోజుల్లో ఈ పాట రాశా. గిఫ్టన్‌ బాణీ, హరిహరన్‌ పాడిన విధానం... బాగా కుదిరాయి. సిరివెన్నెల, వెన్నెలకంటితో పాటు చాలా మంది పాట బాగుందని మెచ్చుకున్నారు. పదాలు  అలంకరించావయ్యా అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ గీతం రచయితగా సంతృప్తినిచ్చింది’’.

చిత్రం: మిస్‌ మ్యాచ్‌
రచన: ధర్మతేజ
సంగీతం: గిఫ్టన్‌ ఇలియాస్‌
గానం: హరిహరన్‌

పల్లవి: కన్నాలే కలలెన్నో కనుచూపు మేరల్లో కలయికలు ఆగవనీ
కనురెప్పే తల తిప్పి తను తప్పుకుంటే కన్నీళ్లు దాగవనీ
నీ పిలుపే ఈ గెలుపు నీ తలపే ఓ మలుపు
ఎదురుపడిన ఎవరినీ అడగను బదులు
ఒకరికొకరు విడిపడి అడుగులు మొదలూ
గమ్యాలు మారే పయనాలలోన మౌనాల గాయాలైనా
దూరాలు చూసే నయనాలలోన తీరాలు దరి చేరేనా  ।। గమ్యాలు మారే ।।
చరణం -1
అణువణువున అలజడులే రేగేన నీలో దాచేసినా
కల చెదిరిన కనులకు తడి ఆరేదేనా మనసే ముసుగేసినా
కుమిలే ప్రాణాల ఈ గుండె కోత ఎవరైనా తీర్చేదేనా
కలవని కథ కరగని వ్యధ తరగనిదని తీరనిదని ఎపుడైనా తెలిసేదేనా
ఎదురుపడిన ఎవరినీ అడగను బదులు
ఒకరికొకరు విడిపడి అడుగులు మొదలూ
ఊరంతా చేరి ఊరేగిస్తున్నా ఉలుకు పలుకు లేదుగా
ఆశాకిరణాలే ఉదయిస్తూ ఉన్నా మనసంతా చీకట్లేనా
కోరస్‌: దూరాలు పెరిగి దారాలు తెగుతూ తీరాలు మారే వేళా
ఏ చేతి రాతో ఈ గుండె కోత మోయలేని యాతనా
ఈ జన్మే నీ కోసం నీ ప్రేమే నా ప్రాణం నా ప్రాణంలో ప్రాణమా
నీవుండే ఈ గుండె పిండేసె నీవన్న మాటరాని మౌనమా...
చరణం - 2
శిఖరములకు ఎదిగిన తొలి విజయాలే కన్నోడికి ఆనందమై
నిను మలచిన మెలకువలకు కానుకలైన నిజమైన అనుబంధమే
సంతోషాలన్ని మిన్నంటిన వేళా కనుమరుగై అనురాగమే
సరిపడదని ముడిపడదని తుది వరకిది మారనిదని
కడసారిగ శలవడిగేనా...
ఎదురుపడిన ఎవరినీ అడగను బదులు
ఒకరికొకరు విడిపడి అడుగులు మొదలూ
ఊరంతా చేరి ఊరేగిస్తున్నా ఉలుకు పలుకు లేదుగా
ఆశాకిరణాలే ఉదయిస్తూ ఉన్నా మనసంతా చీకట్లేనా
కోరస్‌: దూరాలు పెరిగి దారాలు తెగుతూ తీరాలు మారే వేళా
ఏ చేతిరాతో ఈ గుండె కోత మోయలేని యాతనా
।। ఈ జన్మే నీ కోసం ।।

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.