close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రౌద్రం రణం రుధిరం

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’

- ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల్లో ఆసక్తిని  రేకెతిస్తున్న చిత్రమిది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం... తొలిసారి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌   చరణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో  అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రేక్షకులు  ఈ సినిమా విడుదల గురించి ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఉగాది సందర్భంగా బుధవారం పేరుతో కూడిన లోగోల్ని, మోషన్‌ పోస్టర్లని విడుదల చేశారు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే సంక్షిప్త నామం వెనక ఉన్న అసలు పేరేంటో ఈ పోస్టర్ల ద్వారా స్పష్టం చేశారు. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే పేరును ఖరారు చేశారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ‘రైజ్‌ రోర్‌ రివోల్ట్‌’ అనే పేరుని, తమిళంలో ‘రథమ్‌ రణమ్‌ రౌథిరమ్‌’, మలయాళంలో ‘రుధిరమ్‌ రణమ్‌ రౌద్రమ్‌’,  కన్నడలో ‘రౌద్ర రణ రుధిర’ అనే పేర్లని ఖరారు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా భాషల్లో మోషన్‌ పోస్టర్లని విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ సరసన ఆలియాభట్‌  నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తోంది. హిందీ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. డి.వి.వి.దానయ్య    రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.


నీరు.. నిప్పు

సినిమాలో కథానాయకుల పాత్రల స్వభావాలు నీరు, నిప్పుని పోలి ఉంటాయని మోషన్‌ పోస్టర్‌ ద్వారా స్పష్టమైంది. రామ్‌చరణ్‌ భగభగమండే అగ్నిగుండంలా దూసుకొస్తే... ఎన్టీఆర్‌ జలపాతాన్ని గుర్తు చేశాడు. నీరు నిప్పుని ఆర్పేస్తుంది.. నిప్పు నీటిని ఆవిరి చేస్తుంది.
* ఈ రెండు శక్తులు అపారమైన శక్తియుక్తుల్ని కూడగట్టుకొని వస్తున్నాయని రాజమౌళి ట్విటర్‌ద్వారా తెలిపారు.   తిరుగులేని ఆ రెండు శక్తుల వెనక కథేంటన్నది  తెలియాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తుండగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. పోస్టర్‌లో 1920 అని కూడా సూచించారు. ఆ నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. మోషన్‌ పోస్టర్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రధాన  ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.