close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
వైరస్‌ ఒంట్లోకి రావొద్దంటే  మనం ఇంట్లోనే ఉందాం

కరోనాపై సాగుతున్న కదనంలో పాట పల్లవిస్తోంది, కవిత్వం ఉప్పొంగుతోంది. కవులు కలాల్ని విదిలిస్తున్నారు, కళాకారులు గళమెత్తుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే... కరోనాపై అవగాహన పెంపొందించడం! ఇళ్లల్లో ఉంటూ సమరం చేస్తున్న జనానికి ధైర్యాన్ని నూరిపోస్తూ, సేవలు చేస్తున్నవారిని స్మరిస్తూ పాటలు సాగుతున్నాయి. ప్రకృతి గురించి ఆలోచించమని చెబుతున్నాయి.  ప్రముఖ సినీ గీత రచయిత కృష్ణకాంత్‌  స్పందన ఇదీ!

ఈ ఆపత్కాలంలో
మనసుల మధ్య విద్వేషాలని కాదు,
మనుషుల మధ్య దూరం మాత్రమే పెంచుదాం
మనకు ఆరోగ్యాన్ని అదే దగ్గర చేస్తుంది.


ఈ శత్రువుతో మాత్రమే యుద్ధం చేద్దాం
మనకి సేవలందించే వారితో కాదు.
మనకు నమ్మకాన్ని వాళ్లే ఇస్తారు.


మనమేమీ ఆయుధాలు ఎత్తాల్సిన అవసరం లేదు
చేతులు కడుక్కుంటూ ఇంట్లో ఉంటే చాలు.
అదే మనల్ని గెలిపిస్తుంది.


ఇక నుండైనా
చెట్లకి కాస్త ఊపిరాడనిద్దాం  
మన ఊపిరితిత్తులను అవే చూసుకుంటాయి


మనలాగే జంతువులని బ్రతకనిద్దాం
ప్రకృతి సమతౌల్యాన్ని అవే చక్కబెడతాయి


నక్షత్రాలని నేలకి కనపడనిద్దాం
వానల సంగతి ఆ ఆకాశమే చూసుకుంటుంది


భూమికి కాస్త ప్రేమని పంచుదాం
మన భవిష్యత్తుని అదే కాపాడుకుంటుంది

‘‘రెండు మూడు వారాలుగా మనం ఇంతవరకు వినని పదాలెన్నో విన్నాం, వింటున్నాం. క్వారంటైన్‌, సోషల్‌ డిస్టెన్స్‌, ఐసోలేషన్‌ ఇలా ఎన్నో. ఊహించని ఒక విపత్తు. మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులెత్తేసిన దుస్థితి. ఇది మానవాళికి ఒక మేల్కొలుపు, ఎంతో సాధించాం అనుకుంటున్న మానవ మేధకి సవాలు విసిరిన సందర్భం. నిర్మూలన లేదు నివారణ ఒక్కటే మార్గం. మన ప్రధాని జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చేంతవరకు దీని తీవ్రత దేశమంతటికీ తెలియలేదు. శత్రువు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తాడో తెలియదు. కానీ యుద్ధం చేయాల్సిందే. కానీ ఈ యుద్ధం విచిత్రమైనది. కదనరంగంలోకి చెయ్యెత్తి దూకాల్సిన అవసరం లేదు, చేతులు కడుక్కుంటూ ఇంట్లో ఉంటే చాలు. చేయి చేయి కలపకుండా ఒంటరిగానే చేయాల్సిన యుద్ధమిది. ముసుగే కవచం. దూరమే ఆయుధం. ఇటువంటి గంభీర స్థితిలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైషమ్యాలు చిమ్మే పుకార్లు. మతాన్నో, ప్రాంతాన్నో అంటగట్టి చేసే విష రాజకీయాల్ని తరిమి కొడదాం. వార్తా పత్రికల వల్ల ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నారు కాబట్టి చదువుదాం, వాస్తవాలని మాత్రమే నమ్ముదాం. లేని వారికి మన వంతు సాయం చేద్దాం. అప్పుడప్పుడు మనుషుల మధ్య దూరం కూడా మంచిదే. మంచో చెడో కుటుంబంతో గడిపేందుకు కాస్త ఖాళీ దొరికింది. కాస్త సంయమనం పాటిద్దాం , సంకల్పించుకుందాం. ఈ వైరస్‌ మన ఒంట్లోకి రావొద్దంటే మనం ఇంట్లోనే ఉందాం. మన ప్రాణాలతో పాటు తోటి ప్రాణాలని కాపాడుదాం. ఈ భూతాన్ని తరిమి కొడదాం. ఈ భూమికి కాస్త ప్రేమని పంచుదాం. మన భవిష్యత్తుని అదే కాపాడుకుంటుంది’’.

- కృష్ణ కాంత్‌, సినీ గీత రచయిత


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.