close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫాలోవర్స్‌కు మహేశ్‌ విలువైన సూచన

‘నేను ధరించా.. మరి మీరు?’

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన ఫాలోవర్స్‌కు విలువైన సూచన ఇచ్చారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌-4లో సడలింపులు చేయడం వల్ల ప్రజలు తిరిగి సాధారణ జీవితంలోకి నెమ్మదిగా అడుగుపెడుతున్నారు. ఇలాంటి సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని మహేశ్‌ సూచించారు. మాస్కులు ధరించి.. మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఇతరుల్ని సురక్షితంగా ఉంచుదామని పేర్కొన్నారు.

‘మెల్లమెల్లగా తిరిగి మనం సాధారణ జీవితంలోకి వస్తున్నాం.. నెమ్మదిగానే కావచ్చు.. కానీ కచ్చితంగా పరిస్థితులు సాధారణంగా మారుతాయి. ఇలాంటి సమయంలో మాస్కులు తప్పనిసరి. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టిన ప్రతిసారీ మాస్కు ధరించండి. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఇతరుల్ని సురక్షితంగా ఉంచడానికి మనం చేయగలిగే అతి చిన్న పని ఇది. మాస్కు వల్ల మనం చూసేందుకు విభిన్నంగా ఉండొచ్చు. కానీ దాని అవసరం ఇప్పుడు చాలా ఉంది. మనమంతా కచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోవాలి. దీన్ని స్వీకరించి.. కొత్తగా తిరిగి జీవనశైలిని ట్రాక్‌పైకి తీసుకొద్దాం. మాస్కు నేను ధరించా.. మరి మీరు?’ అని ఫాలోవర్స్‌కు సందేశం ఇచ్చారు. మహేశ్‌ ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబట్టింది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు