close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా భర్త హ్యాండ్సమ్‌గా ఉన్నాడా?: సమంత

అమ్మకు, ఆంటీలకు ఫొటో పంపిన తర్వాత..

హైదరాబాద్‌: తన కజిన్‌ రానా దగ్గుబాటి వివాహ వేడుకలు ప్రారంభం కావడంతో అగ్ర కథానాయిక సమంత ఆనందం వ్యక్తం చేశారు. రానా రోకా ఫంక్షన్‌లో తీసుకున్న గ్రూప్‌ ఫొటోను సామ్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘2020లో మాకు శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు రానా, మిహికా బజాజ్‌. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ కుమార్తె, సామ్‌ కజిన్‌ ఆశ్రిత.. ‘నిజంగానే ది బెస్ట్‌ న్యూస్‌’ అని కామెంట్‌ చేశారు.

అంతేకాదు తన భర్త నాగచైతన్య ఫంక్షన్‌లో నవ్వుతుండగా తీసిన ఫొటోను సామ్‌ పంచుకుంటూ.. ‘అమ్మకు, ఆంటీలకు, చెల్లికి, స్నేహితులకు పంపిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తున్నా.. చూడండి నా భర్త చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా??. నా భర్త ఇది చూస్తే ఇక అంతే.. గొయ్యిలోకి దూకేస్తారు (నవ్వుతున్న ఎమోజీలు)’ అని సరదాగా మాట్లాడారు. ఈ ఫొటోకు నాగచైతన్య కామెంట్ చేశారు. ‘ఇది పెయిడ్‌ పార్ట్‌నర్‌ షిప్‌లా ఉంది’ అని సరదాగా మాట్లాడారు. రానా రోకా ఫంక్షన్‌కు సమంత ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేసిన దుస్తుల్ని ధరించారు. 2018 డిసెంబరులో ఆమె అదే డ్రస్‌లో ఉన్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. సామ్‌ ‘జాను’ తర్వాత  ‘ది ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఆమె తదుపరి చిత్రాల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇదీ చదవండి..


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు