
‘‘మనల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు.. మనకి ఏం కావాలో, మన మనసు ఎవరిని కోరుకుంటుందో ఇట్టే తెలిసిపోతుంది. మిహీకాను చూసినప్పుడు నాలో అలాంటి భావనే కలిగింది’’ అంటూ తన ప్రేమ కబుర్లను పంచుకున్నారు హీరో రానా. ఇన్స్టాగ్రామ్ వేదికగా నటి మంచు లక్ష్మీతో మాట్లాడిన ఆయన.. మిహీకా బజాజ్‌తో సాగిన తన ప్రేమ ప్రయాణ విశేషాలను పంచుకున్నారు.
చాలా సింపుల్‌గా తేల్చేశా..
మిహీకా నాకు చాలా రోజుల నుంచే తెలుసు. వెంకటేష్ బాబాయ్ వాళ్ల అమ్మాయి అశ్రితకి మిహీకా క్లాస్‌మెట్. తనకి మంచి స్నేహితురాలు కూడా. తను నాకు అలాగే పరిచయం. వాళ్ల ఇల్లు కూడా మాకు దగ్గరే. పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా లెక్కలేసి ఆలోచించుకుని ఉంటాం కదా. కానీ మనసులోకి ఓ వ్యక్తి వచ్చాక ఆ లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. మిహీకాపై నాకు ప్రేమ కలిగాక అలాగే అనిపించింది. ఆ అమ్మాయి ఏదో మాయ చేసింది. తన నవ్వు, మాట్లాడే విధానం, చేసే పనులు నా ఆలోచనా తత్వానికి దగ్గరగా ఉన్నాయి. తనే నా జీవితం అనుకున్నా. మిహీకాకు నా ప్రేమను తెలపాలి అని నిర్ణయానికొచ్చాక పెద్దగా సమయం తీసుకోలేదు. చాలా సింపుల్‌గా తేల్చేశా. ఓరోజు బాగా ఆలోచించా. మిహీకాతో ఫోన్లో మాట్లాడాను. తర్వాత వ్యక్తిగతంగా కలిశాను. ప్రేమ విషయాన్ని ఒక్క ముక్కలో చెప్పేశా. కాసేపు షాక్‌లో ఉన్న ఆమె ప్రేమకు అంగీకరించింది. తర్వాత ఎంతో సంతోషించింది.
ఇంకా రింగ్ తొడగలేదు
అందరూ అనుకుంటున్నట్లు మాకింకా నిశ్చితార్థం జరగలేదు. మొన్న జరిగింది రోకా వేడుక. ఉంగరాలు మార్చుకోవడానికి ఇంకొంత సమయం ఉంది. చిన్నవయసులో పెళ్లి చేసుకునే వ్యక్తికి కాస్త భయం, కంగారు ఉంటాయేమో. కానీ, నేను ఎదిగాను కాబట్టి నాకలాంటి ఫీలింగ్స్ లేవు అనుకుంటా (నవ్వుతూ).
లాక్డౌన్లో అలా గడిపేస్తున్నా..
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఓటీటీల్లో చూడాల్సినవన్నీ చూస్తున్నా. పుస్తకాలు చదువుతున్నా. ‘వై ఆర్ యు’ అనే ఓ టాక్ షో ప్లాన్ చేశా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారమవుతుంది.
షాక్.. ఆ తర్వాత ఆనందం
మా ప్రేమ సంగతి తెలిసి ప్రతి ఒక్కరిలానే అమ్మానాన్న కూడా షాక్ అయ్యారు. కొద్దిసేపటికి వాళ్లలో సంతోషం మాత్రమే కనిపించింది. మా వాళ్లంతా ఇంచుమించు ఇలాగే ఫీలయ్యారు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ కబురు ఎప్పుడు చెబుతానా అని ఎదురు చూసినవాళ్లే (నవ్వుతూ). ప్రతి ఒక్కరూ మా ప్రేమ సంగతి విని ఆనందిస్తున్నారు. నిజానికి మా ఇరు కుటుంబాలకీ ముందు నుంచీ మంచి స్నేహ బంధం ఉంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
- మోనాల్ సవాల్.. కరీనా నీ ఓపికకు సలాం
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- కోహ్లీ అలా చేసేసరికి కన్నీళ్లు వచ్చాయి
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి