close
టాలీవుడ్‌
దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరుస్తాం

నిర్మాతలతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

దేశవ్యాప్తంగా అన్ని  థియేటర్లు ఒకేసారి తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని తెలుగు సినీపరిశ్రమ నిర్మాతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు డి.సురేష్‌బాబు, వివేక్‌ కూచిభొట్ల, జెమిని కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్‌, దాము కానూరి, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌మరార్‌, ప్రశాంత్‌, రవి, బాపినీడు, దర్శకుడు తేజ తదితరులతో శనివారం కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. థియేటర్లు తెరవడానికి రెండునెలలు ముందుగా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, అప్పుడే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని, అన్ని రాష్ట్రాల్లో       థియేటర్లు ఒకేసారి తెరవాలని సురేష్‌ బాబు సూచించగా.. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. షూటింగుల అనుమతి, థియేటర్లు, క్యాప్టివ్‌ పవర్‌, పైరసీ, ఓటీటీలో సినిమాల విడుదల, రీజనల్‌ జీఎస్టీ, టీడీఎస్‌, సినిమా కార్మికుల ప్యాకేజీ, టైలర్‌మేడ్‌ బీమా, బ్యాంకు రుణాలు తదితర అంశాలు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్‌ లేదని, సినీ పరిశ్రమలో వివక్ష ఉండకూడదని సురేష్‌ బాబు కోరారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్‌, చెన్నారెడ్డిలు ప్రాంతీయ భాషల సినిమాలకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్‌కు, అసోం లాంటి ప్రాంతీయ భాషా చిత్రాలకు ఒకే తరహా జీఎస్టీ సరికాదని తెలిపారు. సినిమా అంటేనే ఎక్కువ జనం ఉంటారని ఈ నేపథ్యంలో థియేటర్లు, షూటింగ్‌లపై కొన్ని భద్రత ప్రమాణాలను రూపొందించామని తేజ తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా సినిమా పైరసీని అడ్డుకుంటాం. వచ్చే మార్చికల్లా సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాలు మార్చనున్నాం. ప్రాంతీయ భాషల సినిమాలను ప్రోత్సహిస్తాం. క్యాప్టివ్‌ పవర్‌పై విద్యుత్తు శాఖ మంత్రితో మాట్లాడుతా. ఏ రాష్ట్రంలో షూటింగులు చేసుకున్నా ఇబ్బందులు లేకుండా చూస్తా. వలస కార్మికుల నిమిత్తం నిధులు విడుదల చేశాం. ఎంఎస్‌ఎంఈలను పటిష్ఠ పరుస్తున్నాం. అవసరమైతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో ఫిల్మ్‌ కోర్సులు చేర్చుతాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ, మత, ప్రాంత బేధాలకు అతీతంగా అందరూ సమష్టిగా ఉండాలని సూచించారు. కరోనా నుంచి బయటపడితే దేశం మళ్లీ పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- ఈనాడు, దిల్లీ


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.