close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవన్నీ మధుర జ్ఞాపకాలే

‘‘జీవితంలోనైనా.. తెరపైనైనా నాకెదురయ్యే ప్రతి సమస్యను ఓ సవాల్‌గా తీసుకుంటా తప్ప బలహీనతగా ఎప్పటికీ మార్చుకోను’’ అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ‘ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో వృత్తిపరంగా మీరు వదులుకోలేకపోయిన, మీకు అడ్డంకిగా అనిపించిన బలహీనతలేమైనా ఉన్నాయా? వాటి వల్ల ఇబ్బందులు పడ్డారా?’ అని ప్రశ్నిస్తే.. ‘‘నేనెప్పుడూ దేన్నీ నా బలహీనత అనుకోన’’ంది కాజల్‌. ‘‘ఎప్పుడైనా ఒక పనిని చూసి భయపడి వదిలేయడమో.. మనకెదురైన సమస్య నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తేనో క్రమంగా అది మన బలహీనతగా మారుతుంది. నేనలాంటి స్థితిలో ఉండాలని ఎప్పుడూ కోరుకోను. ఓ నటిగా నేనెంచుకునే ప్రతి పాత్రలోనూ నాకు సవాల్‌ విసిరే లక్షణాలు కొన్నయినా పక్కాగా ఉంటాయి. నేనెప్పుడూ అలాంటి ఛాలెంజింగ్‌ పాత్రల్ని ఎంచుకోవడానికే ఇష్టపడుతుంటా. అలా చేయగలిగినప్పుడే కదా నన్ను నేను సరికొత్తగా తెరపై ఆవిష్కరించుకోగలిగేది. ఇక ఈ ప్రయాణంలో నటిగా చిత్రీకరణలో నాకెదురైన ఇబ్బందులంటే.. చాలానే ఉన్నాయి. కానీ, నా వృత్తి జీవితంలో అవన్నీ మధుర జ్ఞాపకాలే. ‘వివేగం’ చిత్ర సమయంలో మైనస్‌ 12డిగ్రీల చలిలో చీరపై నటించా. అది నిజంగా ఏ నటికైనా కష్టమైన విషయమే. కానీ, తెరపై ఆ సన్నివేశాన్ని చూసుకున్నప్పుడు, ప్రేక్షకుల్ని ఆ కష్టం మెప్పించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది’’ అంది. కాజల్‌ ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంతో పాటు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’లోనూ నటిస్తోంది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.