close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిరుతో మరో హీరో ఎవరు?

చిరంజీవి కోసం వరుసగా మల్టీస్టారర్‌ కథలే సిద్ధమవుతున్నాయి. ఆ కథల్ని విని చిరు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఆచార్య’ మల్టీస్టారర్‌ సినిమానే. అందులో చిరుతో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘లూసిఫర్‌’ రీమేక్‌ కూడా మల్టీస్టారర్‌ చిత్రమే. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రాన్ని చూసి తన తండ్రి కోసం హక్కుల్ని సొంతం చేసుకున్నారు చరణ్‌. ఈ రెండింటితోపాటు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం కూడా మల్టీస్టారర్‌ కథతోనే తెరకెక్కబోతోంది. అందులో చిరుతో కలిసి నటించబోయే మరో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ విషయంపై దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. మెగా కుటుంబంలోనే పలువురు కథానాయకులు ఉన్నారు. మరి వాళ్లలోని ఒకరు చిరుతో కలిసి నటిస్తారా లేక బయటి హీరోని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ఇప్పటికే చిరు స్క్రిప్టుని పక్కా చేసేశారు. ‘ఆచార్య’ తర్వాత ఈ చిత్రమే పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

* అమ్మ కోసం చేపల కూర

అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట అంటూ తన తల్లి అంజనాదేవి కోసం చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడుని స్వయంగా చేసి పెట్టారు చిరంజీవి. ఆదివారం రోజు చేసిన ఆ వంటకి సంబంధించిన వీడియోని సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు చిరు. ‘‘చిన్న చిన్న చేపలతో చింతకాయ తొక్కుతో ఫ్రై చేసి పెట్టేది అమ్మ. అమ్మ మాకు ఇంత చేసి పెట్టింది, సరదాగా అమ్మకి ఆ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది’’ అంటూ వంటింట్లోకి దూరారు చిరంజీవి.తన చేతులతో చేపల వేపుడుని తన తల్లికి వడ్డించారు చిరు. ఆ వంటకాన్ని రుచి చూసిన అంజనాదేవి ‘‘చాలా బాగుంది.. నాన్నా’’ అని మెచ్చుకోగానే ఆనందంతో ‘అబ్బబ్బ...’ అంటూ చిన్నపిల్లాడిలా ఉత్సాహం వ్యక్తం చేస్తూ వీడియోలో కనిపించారు చిరంజీవి.

View this post on Instagram

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.