close
అప్పటి ముచ్చట్లు
ఆ కారు పంపిస్తేనే షూటింగ్‌కి వస్తానన్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ బంపర్‌ హిట్‌ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ సినిమా బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సినిమా చిత్రీకరణకు రావడానికి బాలకృష్ణ  ఓ కండిషన్‌ పెట్టారంటే నమ్ముతారా. అదేంటి.. బాలయ్య దర్శకుల హీరో కదా... అలాంటి ఇబ్బందులేం పెట్టడంటారే అనుకుంటున్నారా? ఆ షరతు ఏంటో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్‌ ఏంటో తెలుస్తుంది. అది ఆ సినిమా హిట్‌ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది కూడా.

పోలీసు నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే...  ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు అదుర్స్‌ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్‌ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోతారు. అలానే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ చిత్రీకరణ సమయంలో పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ ఓ సందర్భంలో చెప్పారు.

ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు అన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమా నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా.. అప్పుడు ఆ పాత్రలో లీనమవ్వగలను అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య బాబు ఆ రోజు పోలీసు జీపులో పోలీసుల్లా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్‌ ఆయనకి. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు

- బి.గోపాల్‌, ప్రముఖ దర్శకుడు


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.