close
హాలీవుడ్
ఆరో టెర్మినేటర్‌ వస్తున్నాడు

హాలీవుడ్‌ కథానాయకుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌   నెగ్గర్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ది టెర్మినేటర్‌’. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ వచ్చిన ఐదు చిత్రాలు అభిమానులను అలరించాయి. ఇప్పుడు ఆరో చిత్రంగా ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో మరోసారి టెర్మినేటర్‌గా కనిపించనున్నారు ఆర్నాల్డ్‌. ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. రెండో టెర్మినేటర్‌ చిత్రంలో నటించిన లిండా హామిల్టన్‌, ఎడ్వర్డ్‌ ఫర్లంగ్‌ తాజా చిత్రంలో అవే పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో తొలి రెండు చిత్రాలను తెరకెక్కించిన జేమ్స్‌ కేమరూన్‌ ఈ కొత్త చిత్రానికి రచయితగా వ్యవహరిస్తున్నారు. టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబరు 1న మనదేశంలో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ,  మలయాళ భాషల్లో  విడుదల  కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.