Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103335
            [news_title_telugu_html] => 

‘ఎన్టీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌ ఎందుకు వేసుకున్నాడు?’

[news_title_telugu] => ‘ఎన్టీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌ ఎందుకు వేసుకున్నాడు?’ [news_title_english] => Paruchuri Gopala Krishna About the Difference Between Crisis and Plot Point [news_short_description] => ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో అలనాటి సినిమా సంగతులతో పాటు, కొత్త దర్శకులు, రచయితలకు ఆన్‌లైన్‌ వేదికగా పాఠాలు చెబుతున్న [news_tags_keywords] => temper,Paruchuri GopalaKrishna,Paruchuri,Paruchuri Palukulu [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/m_rShv0YZ3M [news_videoinfo] => |https://www.youtube.com/embed/m_rShv0YZ3M [news_sections] => ,0210, ) )
‘ఎన్టీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌ ఎందుకు వేసుకున్నాడు?’ - Paruchuri Gopala Krishna About the Difference Between Crisis and Plot Point - EENADU
close
అవీ.. ఇవీ..
‘ఎన్టీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌ ఎందుకు వేసుకున్నాడు?’

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో అలనాటి సినిమా సంగతులతో పాటు, కొత్త దర్శకులు, రచయితలకు ఆన్‌లైన్‌ వేదికగా పాఠాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆయన చెప్పే సలహాలు, సూచనలు ఎంతోమంది యువ దర్శకులకు మార్గ దర్శకాలు అవుతున్నాయి. కాగా, తాజాగా సినిమాలో విషమ పరిస్థితి(క్రైసిస్‌), ప్లాట్‌ పాయింట్‌పై విద్యార్థులకు ఉదాహరణలతో కూడిన పాఠాన్ని చెప్పారు. హీరో, హీరోయిన్‌ వాళ్ల ఆశయాన్ని వదిలేసేయడమే విషమ పరిస్థితి అని వివరించారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా చెప్పారు.‘హీరో, హీరోయిన్‌లు ఎట్టి పరిస్థితుల్లో సాధించలేరిక’ అనుకున్నప్పుడు కూడా క్రైసిస్‌ అవుతుందని వివరించారు. తాము కథలు అందించిన చిత్రాల్లోని క్రైసిస్‌ పాయింట్‌లనే కాకుండా, ఇతర సినిమాల్లో ఉన్న ఆ పాయింట్‌ను కూడా తెలియజేశారు. 

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్‌’లో క్రైసిస్‌ పాయింట్‌ గురించి మాట్లాడుతూ.. ‘అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసిన వారికి శిక్షపడాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ కూడా ఆ ఘాతుకానికి పాల్పడినట్లు కోర్టులో చెబుతాడు. అప్పుడు ప్రేక్షకుడి గుండె ఝల్లుమంటుంది. ఆ పాయింట్‌తో ప్రేక్షకులు గుండె పిండేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఇతనిని ఉరిశిక్ష నుంచి ఎవరు కాపాడతారు. హీరోనే తనకు తాను సెల్ఫ్‌ గోల్‌ వేసేసుకున్నాడు. అన్న అద్భుతమైన క్రైసిస్‌ పాయింట్‌ టెంపర్‌లో మీకు అక్కడ వస్తుంది’ అని వివరించారు. ఇలా ‘రాజా దిగ్రేట్‌’, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘అర్జున్‌రెడ్డి’ తదితర చిత్రాల్లోని క్రైసిస్‌ పాయింట్‌ల గురించి కూడా వివరించారు. 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.