Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142938
            [news_title_telugu_html] => 

అనుష్కతో నన్నెప్పుడైనా చూశారా?: ప్రభాస్‌

[news_title_telugu] => అనుష్కతో నన్నెప్పుడైనా చూశారా?: ప్రభాస్‌ [news_title_english] => Anushka and I are good friends says Prabhas [news_short_description] => టాలీవుడ్‌ ఆన్‌స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరి పెళ్లి జరగబోతోందని, ఇల్లు కూడా కొనడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు రాశారు. ఈ వదంతులపై ప్రభాస్‌ను తాజాగా .... [news_tags_keywords] => anushka,prabhas,relations [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0210, ) )
అనుష్కతో నన్నెప్పుడైనా చూశారా?: ప్రభాస్‌ - Anushka and I are good friends says Prabhas - EENADU
close
అవీ.. ఇవీ..
అనుష్కతో నన్నెప్పుడైనా చూశారా?: ప్రభాస్‌

దేవసేనతో ప్రేమ ప్రచారంపై బాహుబలి రిప్లై

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ఆన్‌ స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరి పెళ్లి జరగబోతోందని, ఇల్లు కూడా కొనడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు రాశారు. ఈ వదంతులపై ప్రభాస్‌ను తాజాగా ఓ ఆంగ్ల మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. అనుష్క తనకు మంచి స్నేహితురాలని సమాధానం ఇచ్చారు.

‘మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య దీనికి మించిన బంధం మరేదైనా ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. గత రెండేళ్లలో నేను, అనుష్క జంటగా ఎప్పుడైనా, ఎవరికైనా కనిపించి ఉండాలి కదా?. అనుష్క గురించి కరణ్‌ జోహార్‌ షోలో కూడా నన్ను అడిగారు. దానికి రానా, రాజమౌళి సమాధానం చెప్పారు. మా మధ్య అలాంటిదేమీ లేదని చెప్పారు. నేను వారితో ఆ మాటలు చెప్పించలేదు.. వారే స్వయంగా అన్నారు’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. ప్రభాస్‌, అనుష్క కలిసి ‘బిల్లా’, ‘మిర్చి’, ‘‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల్లో నటించారు. వీరిద్దరి జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఇలా జోడీగా పలు చిత్రాల్లో నటించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వీరి ప్రేమ గురించి తెగ ప్రచారం చేస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.