close
అవీ.. ఇవీ..
‘అ’ సీక్వెల్‌లో విజయ్‌ సేతుపతి

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణంలో, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్‌ సినిమా ‘అ’. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో అవార్డులు లభించాయి. అయితే ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్‌ తీయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘అ’ సినిమాలోలాగా విభిన్న కథలు చూపించకుండా ఒకే కథ మీద ఈ సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఇందులో తమిళ నటుడు విజయ్‌సేతుపతి, నటి కాజల్‌ నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘అ!’లో కాజల్, నిత్యా మేనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.