Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000550
            [news_title_telugu_html] => 

దేశం మరో గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

[news_title_telugu] => దేశం మరో గొప్ప నాయకుడ్ని కోల్పోయింది [news_title_english] => Celebrities condolences to Arun jaitley [news_short_description] => భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని సోషల్‌మీడియాలో  పోస్ట్‌లు చేశారు. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ... [news_tags_keywords] => arun jaitley,celebrities ,condolences [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0210, ) )
దేశం మరో గొప్ప నాయకుడ్ని కోల్పోయింది - Celebrities condolences to Arun jaitley - EENADU
close
అవీ.. ఇవీ..
దేశం మరో గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

అరుణ్‌ జైట్లీ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని సోషల్‌మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమలత, రవీనా టాండన్‌, లతా మంగేష్కర్‌, అనిల్‌ కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.

‘అరుణ్‌ జైట్లీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఆయన ఆదర్శప్రాయమైన పార్లమెంటు సభ్యుడు, గొప్ప నాయకుడు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’

-సినీ నటి, ఎంపీ సుమలత

 ‘జైట్లీ ఓ డైనమిక్‌ లీడర్‌, జెంటిల్‌మెన్‌. ఆయనతో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’

- ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

‘20 ఏళ్ల క్రితం అరుణ్‌ జైట్లీని తొలిసారి కలిశా. అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారిపోయా. ఆయన కన్నుమూత మన దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’

- బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్

‘అరుణ్‌ జైట్లీ మృతి నన్ను షాక్‌కు గురి చేసింది. ఓ మంచి మనిషి త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోయారు’

- నటి రవీనా టాండన్‌

‘అరుణ్‌ జైట్లీ మృతి నన్నెంతో బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను’

- ప్రముఖ గాయని ఆశా భోంస్లే

‘మరో గొప్ప నాయకుడ్ని దేశం కోల్పోయింది. ఇలాంటి కష్ట సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు తట్టుకునే బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’

- బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌

‘మన దేశం మరో గొప్ప నాయకుడు అరుణ్‌ జైట్లీ జీని కోల్పోయింది. మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం’

- నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘మనం మరో భాజపా నేతను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన మృతి దేశానికి తీరని లోటు’

- టాలీవుడ్‌ నటి ప్రణీత

 ‘గొప్ప నాయకుడు అరుణ్‌ జైట్లీకి ఇదే మా వీడ్కోలు. మీరు దేశం కోసం చేసిన సేవకు ధన్యవాదాలు’

- టాలీవుడ్‌ నటుడు సుశాంత్‌

‘అరుణ్‌ జైట్లీ కన్నుమూత నన్నెంతో బాధించింది. భారత్‌ అభివృద్ధి కోసం ముందు చూపుతో వ్యవహరించిన ఆయనకు నేను అభిమానిని. ఆయనలాంటి నాయకుడిని గతంలో కలవడం నా అదృష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’

- బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.