close
అవీ.. ఇవీ..
నా కటౌట్లు పెట్టొద్దు: సూర్య

హైదరాబాద్‌: తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘బందోబస్త్‌’. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో సూర్య తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తన చిత్రాల విడుదల సమయంలో హోర్డింగ్‌, కటౌట్లు పెట్టొద్దని కోరారు. కటౌట్లు, హోర్డింగ్‌లకి బదులు రక్తదాన శిబిరాలలాంటి మంచి పనులను చేయండి అని సూర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల చెన్నైలో రోడ్డుపై ఏర్పాటుచేసిన ఓ హోర్డింగ్‌ కూలడంతో శుభశ్రీ అనే యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్య ఈ విధంగా విజ్ఞప్తి చేయడంతో అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఎన్‌.జి.కె. చిత్రం తర్వాత సూర్య నటిస్తున్న చిత్రం ‘బందోబస్త్‌’. ఈ సినిమాకి కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్‌, ఆర్య, సాయేషా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.