close
అవీ.. ఇవీ..
వెన్నెల కిషోర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు వెన్నెల కిషోర్‌ నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్నది ఈ చిత్రం. ఇటీవల ఈ సినిమా థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వెన్నెలకిషోర్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నారట. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌మీడియా వేదికగా సుధీర్‌బాబు అభిమానులతో పంచుకున్నారు. ‘‘వి’ షూటింగ్ గ్యాలరీలోని ఈ వీడియో ఫుకేట్‌ షెడ్యూల్‌లో చిత్రీకరించింది. వెన్నెల కిషోర్‌ని యాక్షన్‌ స్వీక్వెన్స్‌ కోసం సిద్ధం చేస్తున్నాం.’ అని సుధీర్‌ పేర్కొన్నారు.

నాగార్జున కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘మన్మథుడు2’ చిత్రంలో వెన్నెలకిషోర్‌ కీలకపాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రకుల్‌ ప్రీత్ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.