close
అవీ.. ఇవీ..
చరణ్‌తో ‘సైరా’ తీస్తారా అని చిరు అడిగినప్పుడు..

‘సైరా నరసింహారెడ్డి’ థ్యాంక్యూ ఇండియా మీట్‌లో పరుచూరి

హైదరాబాద్‌: ‘‘2004లో మేం ఈ సినిమాని రిజిస్టర్‌ చేయించుకున్నాం. కానీ ఆ సమయంలో చిరంజీవి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ కథ పట్ల మా తపనను చూసి మా అబ్బాయి రామ్‌ చరణ్‌తో ఈ సినిమా తీస్తారా? అని అడిగారు’ అని ప్రముఖ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ ‌2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం థ్యాంక్యూ ఇండియా మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘2004లో సైరా కథను పరుచూరి వెంకటేశ్వరరావు రాశారు. చిరంజీవి ఎందుకు ఇలాంటి పాత్రల్లో చేస్తున్నారు. చిరంజీవితో ఏదైనా గొప్ప సినిమా చేయాలి అని వెంకటేశ్వరరావు నాతో అంటుండేవాడు. మా అన్నయ్య అనుకున్నవిధంగా చిరంజీవిని గొప్పగా చూపించిన పాత్ర ‘సైరా’. బడ్జెట్‌ పెట్టేవాళ్లు లేక 16 ఏళ్లు ఈ సినిమా ఆగింది. ఈ చిత్రం కోసం చరణ్‌ ఒక్కో రూపాయిని పైసాలాగా ఖర్చుపెట్టారు. ముందు రూ.70 కోట్లు అనుకున్నాం కానీ, ఆ తర్వాత బడ్జెట్‌ చాలా భారీగా అయ్యింది. మాకు భయమేసింది. ఈ సినిమా ఎక్కడివెళ్లిపోతుందో అని! ఝాన్సీ లక్ష్మీభాయి కంటే ముందు ఆంగ్లేయులకు ఎదురుతిరిగిన మొదటి గొంతు తెలుగువాడిది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాలనే మా తపన చూసిన చిరంజీవి రామ్‌చరణ్‌తో ఈ సినిమా తీస్తారా అని అడిగారు. వద్దండి మాకు మీరే కావాలి అని అన్నాం. ఆ కథ అంత గొప్పది మరి. బుధవారం ‘సైరా’ విడుదలైన సందర్భంగా నేను చిరంజీవికి మెసేజ్‌ పెట్టాను. వెంటనే చిరు రిప్లై ఇస్తూ.. ‘సైరా’ మీ బిడ్డ. దాన్ని నా బిడ్డ చేతిలో పెట్టారు. మా బిడ్డ తీసిన ఈ చిత్రాన్ని ఇవాళ ప్రపంచమంతా చిరంజీవా అని దీవిస్తోంది. ధన్యవాదాలు సోదరా’ అని నాకు మెసేజ్‌ పెట్టారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు. 

సైరాకు ఆ ముగ్గురే హీరోలు: సత్యానంద్‌

ఈ సందర్భంగా మాటల రచయిత సత్యానంద్‌ మాట్లాడుతూ.. ‘పదేళ్ల కిత్రం అనుకున్న ‘సైరా’ చిత్రం ఇప్పడు ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం రామ్‌ చరణే. చిరంజీవి ఇప్పటివరకూ ఎన్నో చిత్రాల్లో నటించారు. కానీ ఆయనకు అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రంలో నటించాలని ఉండేది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో చిరంజీవి కల నిజమైనందుకు నాకు సంతోషంగా ఉంది. సైరా నరసింహారెడ్డికి రామ్‌చరణ్‌, చిరంజీవి, సురేందర్‌రెడ్డి ఈ ముగ్గురే హీరోలు’ అని అన్నారు. 

సైరా చరిత్రలో నిలిచిపోతుంది: పరుచూరి వెంకటేశ్వరరావు

‘సైరా’కు కథను అందించిన పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నాకు, చిరంజీవికి కిందటి జన్మలో ఏదో అనుబంధం ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవికి మూడు గంటల్లో ‘ఖైదీ’ కథను రాశాం. చాలా సినిమాలు ఆయనతో చేశాం. చరిత్రలో నిలిచిపోయే సినిమా చిరంజీవి చేయాలి అనుకున్నాం. రామ్‌చరణ్‌ని కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. చిరంజీవికి చెప్పాం ఆయనకు కూడా నచ్చింది. ఇది ఉత్తరాంధ్రాకో, దక్షిణాంధ్రాకో సంబంధించిన చిత్రం కాదు. ఆంధ్రా నుంచి వచ్చిన ఒక వ్యక్తి మొదటిసారి ఆంగ్లేయులను ఎదిరించాడు. సైరా పోస్టర్‌ చూస్తే చిరంజీవి చాలా అందగా కనిపించాడు. రోజు రోజుకీ ఆయన యువకుడిలా మారుతున్నాడు. చరిత్ర నిలిచిపోయే వరకు ఈ చిత్రం ఉంటుంది. చిరంజీవి చరితార్థులు. సురేందర్‌రెడ్డి ఈ కథకు ప్రాణం పోశారు. జగపతిబాబు నటన ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించేలా ఉంటుంది.’ అని అన్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.