close
అవీ.. ఇవీ..
తాతయ్య.. నువ్వు రాక్‌స్టార్‌: హరీశ్‌ శంకర్‌

హైదరాబాద్‌: ‘ఎల్లువచ్చి గోదారమ్మ.. ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ శోభన్‌ బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ‘దేవత’ సినిమాలోనిది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1982లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల ఈ పాటను హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో రీమేక్‌ చేశారు. ఈ పాటలో ఫూజా హెగ్డే, వరుణ్‌తేజ్‌ డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఓ తాత ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న టిక్‌టాక్‌ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ ‘తాతయ్య రాకింగ్‌’ అని తెలిపారు. ఈ ట్వీట్‌ చూసిన హరీశ్‌ స్పందిస్తూ ట్విటర్‌ వేదికగా ‘తాతయ్య.. నువ్వు రాక్‌స్టార్‌’ అని ట్వీట్‌ చేశారు.

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మించారు. పూజాహెగ్డే కథానాయిక. ‘ముకుంద’ సినిమా తర్వాత పూజా-వరుణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.