close
అవీ.. ఇవీ..
ఆ వార్తపై రానా ఆగ్రహం

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి తన ఫిజిక్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లో జరిగింది. డైట్‌ను కచ్చితంగా పాటించే రానా లండన్‌కు తన చెఫ్‌ను కూడా తీసుకెళ్లారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్త రాసింది. రానా దిగిన హోటల్‌ కిచెన్‌లోనే తన కోసం ప్రత్యేక వంటకాలను ఆ చెఫ్‌ తయారు చేసేవాడు అని రాసుకొచ్చింది. దీన్ని ట్విటర్‌లో కూడా పోస్టు చేసింది. 

తాజాగా ట్విటర్‌లో ఈ వార్తను చూసిన రానా సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను అసలు లండన్‌ షెడ్యూల్‌లోనే పాల్గొనలేదు. మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు’ అని మండిపడ్డారు. దీంతో సదరు వార్తాసంస్థ ఆ ట్వీట్‌ను వెంటనే డిలీట్‌ చేసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.