close
అవీ.. ఇవీ..
వి.వి.వినాయక్‌ హీరో లుక్‌

హైదరాబాద్‌: ‘ఆది’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘దిల్‌’, ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నంబర్‌150’ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌. త్వరలో ఆయన వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా ఆయన న్యూలుక్‌తో ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆయన ఫొటోలకు తెగ లైకులు కొడుతున్నారు. వి.వి.వినాయక్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌9న సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. ‘శరభ’ సినిమా దర్శకుడు నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

2018లో విడుదలైన ‘ఇంటిలిజెంట్‌’ సినిమాకి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.