close
అవీ.. ఇవీ..
ఆ ఘనత సాధించనున్న నాన్‌-ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ బాహుబలి

హైదరాబాద్‌: ప్రముఖ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో స్కోర్‌ వినిపించబోతున్న తొలి నాన్‌-ఇంగ్లీష్‌ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్‌’ కావడం చాలా సంతోషంగా ఉందని ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. 2015 జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించారు. సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’ స్కోర్‌ను అక్టోబరు 19న రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించబోతున్నారు.

ఈ సందర్భంగా రాజమౌళి పోస్ట్‌ చేశారు. ‘అక్టోబర్ 19న ప్రపంచంలోనే ఫేమస్‌ అయిన లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి’ సినిమా స్కోర్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించబోతుండటం చాలా ఉత్సుకతగా ఉంది. రాయల్‌ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. మొట్టమొదటిసారి ఈ హాల్‌లో ప్రదర్శించబోతున్న నాన్‌-ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ మా ‘బాహుబలి: ది బిగినింగ్’ కావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో ‘బాహుబలి’ చిత్ర బృందం పాల్గొనబోతోంది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.