close
అవీ.. ఇవీ..
ఆ యాక్సిడెంట్‌ నేను చేయలేదు: బిగ్‌బాస్‌ తార

చెన్నై: కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ 2’ రియాల్టీ షో ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు యషికా ఆనంద్‌. తమిళంలో విడుదలైన ‘ఇరిట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ సినిమాతో ఆమె ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా ఈ నటి చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో తన కారుతో భరత్‌ అనే డెలివరీ బాయ్‌ని ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆమె తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన నటి తాను ఎటువంటి యాక్సిడెంట్‌ను చేయలేదని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నటి బాధితులకి సాయం చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.