close
అవీ.. ఇవీ..
మహేశ్‌ రెమ్యూనిరేషన్‌పై నిర్మాత ఏమన్నారంటే?

హైదరాబాద్‌: ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ప్రిన్స్‌ మహేశ్‌బాబు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ తన రెమ్యూనిరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశారనీ.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం ఆయన రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఈ సినిమా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్‌ సుంకర ఈ వార్తలపై స్పందించారు. ‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం ఇప్పటివరకు మహేశ్‌కి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్‌కి కూడా భాగస్వామ్యం ఉంది. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించినప్పుడు మహేశ్‌ తన వాటా తీసుకుంటారు’ అని అనిల్‌ తెలిపారు.

మరోవైపు ఈ సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌రాజుతో తనకు గొడవలు ఉన్నాయంటూ వస్తున్న రూమర్స్‌పై అనిల్‌ సుంకర స్పందించారు. ‘దిల్‌రాజు నాకు ఆత్మీయుడు. ఆయనతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అనిల్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో విడుదలైన ‘ఎఫ్‌2’ చిత్రం తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్‌కి జంటగా రష్మిక నటించనున్నారు. అలనాటి తార విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన మహేశ్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.