close
అవీ.. ఇవీ..
మోదీజీ..దానికి చాలా కారణాలున్నాయి: పూరీ

సోషల్‌మీడియా వేదికగా ప్రధాని లేఖ రాసిన పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్‌ను ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చాలని, ఇందుకోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వాతవరణంలో వస్తున్న మార్పులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఒక్కటే కారణం కాదని.. దానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోషల్‌మీడియా వేదికగా ఒక లేఖ రాశారు.

‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ప్లాస్టిక్‌ కూడా ఒక కారణం. కేవలం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించినంత మాత్రాన పర్యావరణం బాగుపడదు. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత దానిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల అది పర్యావరణానికి హానికారకంగా తయారవుతోంది. అయితే, ప్లాస్టిక్‌ను నిషేధించి పేపర్‌ బ్యాగుల వాడకం మొదలుపెట్టడం వల్ల చెట్లను నరికే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముంది. వాతావరణ మార్పుల నుంచి మనం బయటపడాలంటే మొక్కలను ఎక్కువగా నాటాలి. భూమి మీద జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గురించి అందరికీ అవగాహన కల్పించాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ, మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. దీనిని గురించి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని ప్రకటిస్తే.. ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయ్యకుండా తీసుకువచ్చి ఆ కేంద్రాల్లో ఇస్తారు. ఇలాంటివి చేసినట్లు అయితే పర్యావరణాన్ని ప్లాస్లిక్‌ నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు.’ అని పూరీ పేర్కొన్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.