close
అవీ.. ఇవీ..
శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం

హైదరాబాద్‌: అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డు నటి రేఖకు వరించింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను టి.సుబ్బరామిరెడ్డితో కలిసి టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్‌ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందించనున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. అలాగే అదేరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా’ మూడో కాన్వకేషన్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రేఖ ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు.

సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్‌ అవార్డును అందించడం జరుగుతోంది. 2006లో తొలిసారిగా ఈ అవార్డును దేవ్‌ ఆనంద్‌కు అందించారు. 2017 సంవత్సరంలో ఈ అవార్డు దర్శకధీరుడు రాజమౌళిని వరించింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.